మెగాస్టార్ ఆచార్య సినిమాలో.. జబర్దస్త్ ఇమ్మానియేల్ కి కీరోల్?

praveen
ఇటీవలి కాలంలో జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించిన కమెడియన్స్ లో ఇమ్మానియేల్ మొదటి స్థానంలో ఉంటాడు.  ప్రస్తుతం ఈ టీవీ లో సక్సెస్ ఫుల్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఊహించనంత క్రేజ్ సంపాదించాడు ఇమ్మానియేల్. అంతేకాదు ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా కొనసాగుతున్న వర్ష ఇమ్మానియేల్ మధ్య లవ్ స్టోరీ కాస్త బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇద్దరు కూడా బుల్లితెరపై బ్లాక్ అండ్ వైట్ జోడీగా కొనసాగుతున్నారు.

 ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కారణంగా ఇమ్మానియేల్ మరింత క్రేజ్ సంపాదించాడు అని చెప్పాలి.  ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ లో ఇమ్మానియేల్ ఎంతో కీలకమైన కమెడియన్ గా అందరి టీమ్స్ లో కూడా స్కిట్ లు చేస్తూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు.  అయితే తనకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక కీ రోల్ ఆఫర్ వచ్చింది అంటూ ఇమ్మానియేల్  చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఈ ప్రోమోలో భాగంగా అటు ఇమ్మానియేల్ స్కిట్ చేస్తున్న సమయంలో.. నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి తెలుసా అంటూ చెబుతాడు ఇమ్మానుయేల్..  అంత పెద్ద ఆఫర్ ఏమొచ్చింది అని అడుగగా.. మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు కదా.. ఆ సినిమాలో నాకు కీ రోల్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఏంటి మెగాస్టార్ సినిమాలో నీకు కిలోలు వచ్చిందా  అంటూ పక్కనే ఉన్న మరో కమెడియన్ ఆశ్చర్యపోతుంది. కీ ఎంత ఉంటుంది..  చిటికెడంత ఉంటుంది..  నాకు కూడా ఆచార్య సినిమాలో అంతే రోల్ వచ్చింది అంటూ ఇమాన్యుల్ పంచ్ వేస్తాడు..  దీంతో అక్కడున్న వారు నవ్వుకుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: