అక్కినేని నట వారసుడిగా ప్రేక్షకులను మైమరిపిస్తోన్న నాగ చైతన్య..!!

P.Nishanth Kumar
అక్కినేని నట వారసుడిగా సినిమా పరిశ్రమ లోకి వచ్చాడు అక్కినేని నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ హీరో ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేసి సూపర్ హిట్ లు సాధించడమే కాకుండా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో తాత ఆశీస్సులతో సినిమా పరిశ్రమలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో తన నటనతో ప్రేక్షకులను నిరాశ పరిచిన చైతు ఇప్పుడు అద్భుతమైన నటన తో అందరినీ ఎంతగానో అలరిస్తున్నాడు.
ఇకపోతే ఆయన హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది సెప్టెంబర్ 24వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్న గా నాగచైతన్య కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలు చాలానే ఉన్నాయి రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించాడు ఆ తరువాత ఏ హీరోకి దక్కని సూపర్ హిట్ చిత్రాలను చేసి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. ఏ మాయ చేసావే, 100% లవ్, మనం, మజిలీ వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా లు నాగచైతన్య కెరీర్ లో స్పెషల్ చిత్రాలుగా చెప్పవచ్చు.
అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు చైతు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో కూడా ఈ హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. వీరిద్దరి మధ్య అన్యోన్యత చూస్తుంటే అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇటీవల కాలంలో విడాకులు వీరు తీసుకోబోతున్నారు అనే వార్తలు రావడం పై మండి పడ్డారు. ఏదేమైనా అక్కినేని నాగచైతన్య ఇటు సినిమా జీవితంలో అటు వైవాహిక జీవితంలో ఎంతగానో మెప్పిస్తు తన కెరియర్ ను ముందుకు దూసుకుపోయేలా చేసుకుంటున్నాడు అని చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: