నటసార్వభౌముడే.. ఆ హీరో రూపంలో మళ్లీ పుట్టాడు?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకప్పటి స్టార్ హీరోల వారసుల హవానే ఎక్కువగా నడుస్తుంది అని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి తరచూ ఏదో ఒక ఫ్యామిలీ నుంచి వారసులు హీరో లుగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. కానీ కొంతమంది హీరోలు మాత్రమే స్టార్ హీరోలు గా మారుతున్నారు.  కొంతమంది హీరోలు మాత్రమే అసలు సిసలైన వారసులం అని నిరూపించుకుంటున్నారు.  అలాంటి వారిలో ముందుగా చెప్పాల్సిన పేరు జూనియర్ ఎన్టీఆర్.  తెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.

 వందల సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన దేవుడిగా కూడా పేరుగాంచారు. కృష్ణుడు రాముడు వేషం వేసి దేవుడు అంటే ఎన్టీఆర్ లాగానే ఉంటాడేమో అని తెలుగు ప్రేక్షకులు అనుకునేలా చేశారు.  అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజిలో నందమూరి ఫ్యామిలీ నుండి అసలు సిసలైన వారసుడు రాగలడా అని అభిమానులు భావించారు.  ఇక ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్న సమయంలోనే నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ, హరికృష్ణ లాంటివారు సినిమాలో ఒక స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.  ఇక నేటి తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు నందమూరి వారసులుగా కొనసాగుతున్నారు.

 ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చినప్పటికీ అటు తాతకు తగ్గ మనవడిగా.. సీనియర్ ఎన్టీఆర్ అసలు సిసలైన వారసుడిగా తెలుగు ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి.   పుట్టుకతోనే తాత చరిష్మా తో పాటు తాత రూపురేఖలను కూడా సంపాదించిన ఎన్టీఆర్..  ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నటనకు ప్రతిరూపం గా..  వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ అటు జూనియర్ ఎన్టీఆర్ లో నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటూ మురిసిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: