బిగ్ బ్యాక్ గ్రౌండ్.. బిగ్ డిజాస్టర్స్?

praveen
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం రంగుల ప్రపంచంలో రాణించాలి అంటే ఎంత టాలెంట్ వున్న ప్పటికీ ఆవగింజంత అయినా అదృష్టం కలిసి కావాలి అని చెబుతూ ఉంటారు.  పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే మాత్రం హీరోగా ఎదగడం చాలా కష్టమే అని చెబుతూ ఉంటారు. ఇది అక్కినేని హీరో అఖిల్ విషయంలో నిజంగానే జరిగింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బిగ్ బ్యాక్ ఫ్యామిలీ లలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి..  అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత అక్కినేని నాగార్జున చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు.  ఇలాంటి బిగ్ బ్యాక్ గ్రౌండ్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్.

 ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కానీ ఎందుకో ప్రేక్షకులను మాత్రం ఆకర్షించ లేకపోయాడు. దీంతో అటు బిగ్ బ్యాక్ గ్రౌండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కు బిగ్ డిజాస్టర్సే  మిగిలాయి.  అఖిల్ గొప్ప అందగాడు..  ఆరు పలకల దేహంతో మగువల మనసులు దోచేస్తుంటాడు..  అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ లో ఏ హీరో చేయనంతగా డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా అదరగొడుతున్నాడు.. ఇలా అఖిల్ కి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ హీరోగా మాత్రం ఇప్పటి వరకు హిట్ కొట్టలేకపోయారు. ఎన్నో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక అఖిల్ సినిమాలకు ఆదరణ కరువైంది.

 ఇలా ఎంత బిగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తే ఏంటి..  ఎంత కష్టపడి సినిమాలు చేస్తే ఏంటి.. ఆవగింజంత అయినా అదృష్టం లేకపోతే..  సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో హీరోగా ఎదగడం కష్టం అనేది అఖిల్ విషయంలో నిజం అయ్యింది. వరుసగా డిజాస్టర్స్ రావడంతో నాన్న నాగార్జున రంగంలోకి దిగారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది  ఇక ఈ సినిమాపైనే అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు  తన కెరీర్ లో మొదటి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: