మహేష్ తో ఇక అతడి మూవీ లేనట్టేనా .... ??

GVK Writings
మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి తీసిన సినిమా మహర్షి. 2019 సమ్మర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ మహేష్ కెరీర్ 25వ మూవీ గా తెరకెక్కింది. ఇందులో మహేష్ బాబు, రిషి అనే సాఫ్ట్ వెర్ కంపెనీ సిఈఓ గా కనిపించారు. అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేసిన ఈ సినిమాని హృద్యమైన ఆకట్టుకునే కథ కథనాలతో తీశారు దర్శకుడు వంశీ.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సహజ నటన, హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ తో పాటు అల్లరి నరేష్ పాత్ర మంచి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి అని చెప్పకతప్పదు. ఇక ఈ సినిమాలో చూపించిన వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ కి మంచి పేరు దక్కింది. అలానే ఈ మూవీ ఏకంగా జాతీయ ఉత్తమ్ వినోదాత్మక మూవీ గా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మహర్షి తరువాత ఇటీవల మరొక్కసారి మహేష్ తో వంశీ సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన అది తెరకెక్కలేదు. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న మహేష్ బాబు, అది పూర్తి అయిన అనంతరం త్రివిక్రమ్ తీయబోయే మూవీ షూట్ లో జాయిన్ అవుతారు.
దాని తరువాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీయనున్న సినిమాలో యాక్ట్ చేయనున్న సూపర్ స్టార్, ఆపై అనిల్ రావిపూడి తో వర్క్ చేయనున్నట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే అసలు మరొక మూడేళ్లకు పైగా మహేష్ బాబు డైరీ ఖాళీగానే లేదని అర్ధం అవుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మహేష్ తో వంశీ సినిమా చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదని, ఈ విషయమై మరికొన్నాళ్లు గడిస్తేనే కానీ పూర్తి వాస్తవాలు వెల్లడి కావని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: