లవ్ స్టోరీ విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం ఆమెకే పోతుందట...!

murali krishna
సాయి పల్లవి తమిళ నాట పుట్టి పెరిగిందట ఈ ముద్దుగుమ్మ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిందనీ తెలుస్తుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రజల మనసులను దోచుకుందట ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చిందనీ తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో తనకు వరుస ఆఫర్లు వచ్చాయట. తాజాగా శేఖర్ కమ్ముల సాయి పల్లవితో మరో సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమానే లవ్ స్టోరీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ షో వేశారని సమాచారం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవి నటనపై ప్రశంసల జల్లు కురిపించారని సమాచారం. ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవికే దక్కుతుందంటున్నారట సినీ పరిశ్రమ పెద్దలు l.
నిజానికి సాయి పల్లవి అద్భుతంగా నటించగలదు. అంతకు మించి డ్యాన్స్ కూడా చేయగలదని సమాచారం. మొదటు పలు టీవీ షోలలో డ్యాన్స్ చేసే మంచి గుర్తింపు కూడా తెచ్చుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టిందని సమాచారం.ఈ సినిమాలోనూ సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ చేసిందని తెలుస్తుంది. ఆమె స్టెప్పులకు థియేటర్ లోని వాళ్లంతా చప్పట్లు కొట్టారని సమాచారం.నటనకు రూపం అడ్డుకాదని నిరూపించిందట సాయి పల్లవి. యావరేజ్ అమ్మాయి అయినా కూడా అద్భుతంగా సినిమాల్లో రాణిస్తుందని తెలుస్తుంది.
ఈ రోజుల్లో హీరోయిన్ అంటే అందంగా ఉండాలి అలాగే అందాల ప్రదర్శన చేయాలి అనుకుంటారు అప్పుడే మన దర్శకులకు నచ్చుతుందని అనుకుంటారట.అలా అయితే సాయి పల్లవి లాంటి అమ్మాయి నిజంగా తెలుగు డైరెక్టర్లు తీసుకునే సాహసంచేయరని తెలుస్తుంది. కానీ తన నటన ముందు మిగతావన్నీ దిగదుడుపే అని నిరూపించిందట సాయిపల్లవి. ప్రస్తుతం స్టార్ దర్శకులు సైతం తన డేట్ల కోసం క్యూ కట్టే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అటు తను చేసే ఏ క్యారెక్టర్ అయినా కూడా అత్యద్భుతంగా నటిస్తుందని సమాచారం. కింది స్థాయి నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ముందుకు సాగడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: