బాలయ్య కోసం థమన్ స్పెషల్ కేర్ ... ??

GVK Writings
నటసింహం నందమూరి బాలయ్య హీరోగా ప్రస్తుతం సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీస్తున్న భారీ సినిమా అఖండ. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కాగా ఆయన ఈ సినిమాలో ఒక మధ్యతరగతి రైతు పాత్రలో అలానే అఘోరా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ రెండు పాత్రలకు సంబంధించి ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన రెండు టీజర్స్ ప్రేక్షకులని నందమూరి అభిమానులని ఎంతో అలరించాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా భారీ మాస్, యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా బాలయ్య పోషిస్తున్న రెండు పాత్రలు సినిమాకు ఎంతో ప్రాణంగా నిలుస్తాయని అంటోంది యూనిట్. గతంలో బాలయ్యతో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన సింహా, లెజెండ్ తీసిన బోయపాటి దీనిని మరింత అద్భుతంగా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ మూవీ కోసం థమన్ ఐదు అద్భుతమైన సాంగ్స్ ని సిద్ధం చేసారని, కాగా ఇందులో రెండు మెలోడీస్ తో పాటు ఒక పక్కా మాస్ సాంగ్ అయితే ఎంతో అదిరిపోయాయని ఇన్నర్ వర్గాల సమాచారం.
అలానే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై కూడా థమన్ ఎంతో కేర్ తీసుకుని చేస్తున్నారని, తప్పకుండా త్వరలో విడుదల కానున్న ఈ మూవీ లోని సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటాయని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుందని, త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు టాక్. మరి ముచ్చటగా మూడోసారి బాలయ్య తో బోయపాటి శ్రీను తీస్తున్న ఈ అఖండ ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: