వైష్ణవ్ తేజ్ తో పంజా విసురుతాడట..!!

P.Nishanth Kumar
ఉప్పెన సినిమాతో ఏ హీరోకి దక్కని గ్రాండ్ ఎంట్రీ దొరికింది హీరో పంజా వైష్ణవ్ తేజ్ కు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలోని భారీ కలెక్షన్లను సాధించగా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోగా వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటాడు క్రిష్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కొండాపురం సినిమా దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇకపోతే ఇటీవలే వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమాను కూడా మొదలుపెట్టి దాదాపు 90 శాతం సినిమా పూర్తి చేశాడని తెలుస్తుంది ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో  విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి మూడు సినిమాలను చకచకా పూర్తి చేసి టాలీవుడ్ లో ఏ హీరో చేయనటువంటి వేగంతో ఉన్న వైష్ణవ్ అప్పుడే తన నాలుగో సినిమాను కూడా సిద్ధం చేసుకునే విధంగా ప్రణాళిక ఏర్పరుచుకున్నాడు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా చేసిన దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ సినిమా ఓకే అయ్యింది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పంజా సినిమా తర్వాత ఆయన తెలుగులో సినిమా చేయడానికి అవకాశం రాలేదు. పంజా సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఏ హీరో కూడా ఈ దర్శకుడి పై పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేయగా ఇటీవలే షేర్షా అనే సినిమాను తెరకెక్కించాడు. అది కాస్తా హిట్ కొట్టేసరికి ఇప్పుడు తెలుగులో ఆయనకు సినిమా చేయాలని వరుస అవకాశాలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ కోసం ఆయన ఒక కథ ను తయారు చేయగా అది వైష్ణవ్ కి కూడా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: