పుష్ప లేట్ అవడం పై బన్నీ లో అసహనం.. !!

P.Nishanth Kumar
ఇప్పుడు ఎవరి నోట విన్న పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు. టాలీవుడ్ లో క్రేజీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్రకటించగా ఇప్పుడు ఆ సినిమా క్రిస్మస్ కు విడుదలయ్యే సూచనలు కనబడకపోవడం తో ఒక్కసారిగా మెగా అభిమానుల్లో నిరాశ అలుముకుంది. సినిమాలు నెమ్మదిగా తెరకెక్కించి షూటింగ్ బాగా లేట్ చేసే దర్శకుడిగా పేరున్న సుకుమార్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కి విడుదల చేస్తాడు అని చెప్పగానే ఎవరూ నమ్మలేదు.

వారు నమ్మనట్టు గానే పుష్ప ను క్రిస్మస్ కు రెడీ చేయలేక పోతున్నాడు అని ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే దీనిపై అల్లు అర్జున్ కొంత అసహనం లో ఉన్నట్లుగా తెలుస్తుంది.  మొదట బన్నీ చెప్పిన ప్రకారం పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని షూటింగ్ చేయగా దానికి ఓకే అని ఇప్పుడు నెమ్మదిగా షూటింగ్ కొనసాగించడం బన్నీ కి ఏమాత్రం నచ్చడం లేదట. కనీసం మొదటి భాగం యొక్క సన్నివేశాలు మొత్తం చేసి సినిమాను విడుదల చేయాలని కోరిక కోరగా అది కూడా సుకుమార్ నెరవేర్చకపోవడం ఆయన కు విసుగు వస్తుందట. 

ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ గా వస్తున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించడం. రష్మీక హీరోయిన్ గా చేయడం అదనపు ఆకర్షణ అవుతాయనీ తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫజిల్ విలన్ గా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన దాక్కో దాక్కో మేక అనే పాత అందరిని ఎంతగానో అలరించింది. ఐదు భాషల్లో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: