"ద్యాముడా" అంటూ మాయ చేసిన బన్నీ...

VAMSI
అల్లు అర్జున్ కెరీర్ లో హీరోగా మొదటి సినిమా నుండి నటనలో, డ్యాన్స్ లో మరియు స్టైల్ లో కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుని స్టైలిష్ స్టార్ గా మారాడు. ఇప్పుడు బన్నీ కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. 2014 ఏప్రిల్ 14 న వేసవి సీజన్ లో విడుదలైన అల్లు అర్జున్ రేసు గుర్రం మూవీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది.  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది.  ప్రకాష్ రాజు, శ్యామ్, సలోని, రవి కిషన్ ఇతర పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం బాధ్యతలను చూసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల సమయానికి ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. అంతే కాకుండా మొదటి రోజు కలెక్షన్ ల విషయంలో ఈ సినిమా టాప్ టెన్ లో కూడా లేకపోవడం విశేషం. కానీ మెల్ల మెల్లగా సినిమాలో ఉన్న విషయానికి ప్రేక్షకులు స్పందించారు. 


తరువాత ఒక్క వారం ముగిసే సరికి కలెక్షన్ లో టాప్ 8 కి వచ్చింది. మరియు విదేశాలలో ఈ సినిమా కలెక్షన్ లో 6 వ స్థానంలో నిలువగా, ప్రపంచ వ్యాప్తంగా 4 వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది.  ఈ సినిమా ముఖ్యంగా విమర్శకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగలిగింది. ఇందులో  సినిమా విజయానికి ప్లస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, అల్లు అర్జున్ మరియు శ్రుతి హాసన్ ల మధ్య నడిచిన లవ్ ట్రాక్ మరియు కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఇక కామెడీ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట్లో ఎమ్మెస్ నారాయణ మరియు పోసానిల కామెడీ ప్లస్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం తన నటనతో అదరగొట్టాడు. ఇందులో అల్లు అర్జున్ మరియు శ్యామ్ ల బ్రదర్స్ సెంటిమెంట్ కూడా బాగా వర్క్ ఔట్ అయింది అని ఫిల్మ్ క్రిటిక్స్  చెప్పారు. సినిమా ఆద్యంతం అల్లు అర్జున్ చెప్పే ద్యాముడా అనే డైలాగ్ యూత్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోయింది.


ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి మొదటి హాఫ్ లో కథను చెప్పేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తో లాగించేశాడు. మొత్తానికి రెండున్నర గంటల పాటు థియేటర్ లో ఉంచగలిగాడు. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ ఆండ్ డైలాగ్ డెలివరీ కూడా సినిమా హిట్ అవడంలో సహాయపడింది. ఫైనల్ గా రేసు గుర్రం 2014 సమ్మర్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. రేసు గుర్రం సినిమా 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితం కాగా 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి డబల్ లాభాలను అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: