కరోనా సెకండ్ వలన సినీ ఇండస్ట్రీ తీరే మారిపోయింది.ముఖ్యంగా మన టాలీవుడ్లో తెరకెక్కుతున్న బడా హీరోల భారీ ప్రాజెక్టులు ఒకదానితో మరొకటి పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి.దీంతో మరికొన్ని బడా చిత్రాలు దసరాకు ముహూర్తం ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా దసరాకే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక మరో స్టార్ హీరో బాలయ్య అఖండ కూడా మొదట దసరా రేసులో నిలుస్తోందని వార్తలు వచ్చాయి.కానీ తాజా సమాచారం ప్రకారం అఖండరిలీజ్ క్రిస్మస్ కి షిఫ్ట్ అయ్యిందని తెలుస్తోంది.
త్వరలోనే రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి సుమారు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే బాలయ్య జాతకం ప్రకారం అఖండ సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తే సక్సెస్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారట.అందుకే క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు.అయితే ఇంకా బాలయ్య నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట.ఇక మరోవైపు సరిగ్గా అదే క్రిస్మస్ కి అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్1 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే బాలయ్య కన్నా ముందే బన్నీ ఈ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో బన్నీ, బాలయ్యల మధ్య ఈసారి గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తోంది.
ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం కలెక్షన్స్ విషయంలో ఈ రెండు సినిమాలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో చూడాలి. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది.అటు పుష్ప టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడం. ఇటు బాలయ్య,బోయపాటి శ్రీను ల కాంబోకి భారీ క్రేజ్ ఉండటంతో పాటు అఖండ టీజర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ఈసారి ఈ రెండు సినిమాలు ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు.ఇక ఇదిలా ఉంటె మరోవైపు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ.. మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది...!!