ఎన్టీఆర్‌కు - దాస‌రికి ఆ సినిమాలో అంత పెద్ద గొడ‌వ అయ్యిందా ?

VUYYURU SUBHASH
టాలీవుడ్‌లో దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఏ పాత్రలో అయినా నటిస్తాడు అనే కంటే జీవిం చేస్తారు అని చెప్పాలి. ఒక రాముడిగా  - కృష్ణుడిగా .. ఒక దుర్యోధనుడిగా , ఒక విశ్వామిత్రుడు గా , ఒక కర్ణుడిగా , ఒక బొబ్బిలి పులి గా , జస్టిస్ చౌదరి గా, సర్దార్ పాపారాయుడుగా.. ఇలా ఏ పాత్ర చేసినా ఎన్టీఆర్ నటనను తెలుగు ప్రేక్షకులు వేనోళ్ళ కీర్తించే వారు. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఎంత గొప్ప దర్శకుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాసరి - ఎన్టీఆర్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే దాసరి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

వీరిద్దరి కాంబినేషన్లో మనుషులంతా ఒక్కటే తొలి సినిమాగా వచ్చింది. జమిందారీ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఆ పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ కొన్ని సూచనలు చేయగా వాటితో దాసరి విభేధించారట. తాను చెప్పిన విధంగానే నటించాలని దాసరి పట్టుపట్టడంతో ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారని టాక్  ఉంది. దాసరి ఎన్నిసార్లు చెప్పినా ఎన్టీఆర్ తనకే తెలుసు అన్న విధంగా వ్యవహరించడంతో దాసరి సైతం పట్టుదలకు పోయారట. చివరకు నిర్మాతలు సర్దిచెప్పడంతో ఇద్దరు వెనక్కి తగ్గి షూటింగ్ చేశారు.

అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమాలోనే వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. వీరి మ‌ధ్య ఏనాడు గ్యాప్ రాలేదు. చివ‌ర‌కు రాజ‌కీయంగా మాత్రం వీరు వేర్వేరు పార్టీల్లో కొన‌సాగ‌డంతో అలా శ‌త్రువులు అవ్వాల్సి వ‌చ్చింది. అయితే వృత్తిప‌రంగా మాత్రం వీరు ఎప్పుడూ కూడా స్నేహంగానే ఉండేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: