సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

shami
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. యువ హీరో విజయ్ దేవరకొండ స్టార్ డైరక్టర్ సుకుమార్ ఇద్దరు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతో రేంజ్ పెంచుకుంటొ వెళ్తున్నాడు. ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న దేవరకొంద విజయ్ ఆ సినిమా తర్వాత సుకుమార్ తోనే సినిమా చేస్తాడు. అయితే ఒకవేళ సుకుమార్ పుష్ప సినిమా లేట్ చేస్తే మాత్రం సుకుమార్ సినిమాను వాయిదా వేసి ఆ ప్లేస్ లో వేరే డైరక్టర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సుకుమార్ సినిమా కొద్దిగా లేట్ అవ్వొచ్చేమో కాని కచ్చితంగా ఉంటుందని మాత్రం అంటున్నారు.
లైగర్ తర్వాత బాలీవుడ్ లో కూడా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలు ఆఫర్లు వస్తున్న విజయ్ అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని తెలుస్తుంది. సుకుమార్ సినిమా రెడీ అయ్యే గ్యాప్ లో మరో స్టర్ డైరక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పుడు మాత్రం తన పూర్తి ఫోకస్ పుష్ప మీద పెట్టాడు. పుష్ప రెండు పార్టులను పూర్తి చేసిన తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యాడు. సుకుమార్ ఒకేసారి రెండు సినిమాలకు అసలు పనిచేయడు. అందుకే పుష్ప పార్ట్ 2 రిలీజ్ తర్వాతే తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: