6గంటల పోలీస్ విచారణ.. శిల్ప శెట్టి షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవలి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యాపారవేత్త శిల్పశెట్టి భర్త రాజ్ కుంద్రా కు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా రాజ్ కుంద్రా  పోర్న్ చిత్రాలను నిర్మిస్తున్నారు అన్న ఆరోపణలతో ఇటీవల పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది   రాజ్ కుంద్రా పై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ పోలీసులు చెబుతున్నారు. పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించిన అంశం ఫిబ్రవరి నెలలోనే తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. పోర్న్ చిత్రాలను నిర్మించడమే కాదు పలు యాప్స్ లో రాజ్ కుంద్ర వాటిని అప్లోడ్ కూడా చేశారు అంటూ ఆరోపిస్తూ పోలీసులు అతనిని అరెస్టు చేశారు

 అయితే ప్రస్తుతం రాజ్ కుంద్రా  కేసులో అతని భార్య శిల్పాశెట్టి తో పాటు నటి గెహన వశిస్ట్ కూడా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరిదీ కూడా పోర్న్ చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర ఉంది అంటూ ప్రస్తుతం ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి  అంతేకాకుండా గెహన తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తు ఉండటం సంచలనంగా మారిపోయింది. ఏకంగా అందరూ కలిసి ముంబై కేంద్రంగా ఒక పోర్న్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి వచ్చింది అని పోలీసులు చెబుతున్నారు   ఈ క్రమంలోనే ఇటీవల ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు ఏకంగా ఆరు గంటల పాటు శిల్పాశెట్టి ని విచారించారు.

 విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శిల్పాశెట్టి హాట్ షాట్ యాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు  హాట్షాట్స్ యాప్ ద్వారా ఎలాంటి లాభం పొందలేదు అంటూ తెలిపారు. అంతేకాకుండా తన భర్త పోర్న్ చిత్రాలు నిర్మిస్తుంటే వాటిలో తాను ఎప్పుడూ పాల్గొనలేదు అంటూ తెలిపింది శిల్పా శెట్టి . అయితే రాజ్ కుంద్రా శృంగార భరితమైన సినిమాలు చేసే వారని.. కానీ అవి పోర్న్ సినిమాలు కాదు అంటూ మరోసారి శిల్పాశెట్టి స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనే విషయాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వివరించినట్లు తెలిపింది శిల్పాశెట్టి. అయితే తన భర్త నిర్మించిన సినిమాల కంటే ఓటీటీ ప్లాట్ఫామ్, వెబ్ సిరీస్ లలో కంటెంట్ ఎక్కువ అశ్లీలమైన ది అంటూ చెప్పుకొచ్చింది  ఇక శిల్పా శెట్టి స్టేట్ మెంట్ ను స్వీకరించిన పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: