అప్పట్లో సంచలనం సృష్టించిన మధుబాల లవ్ స్టోరీ..!

VUYYURU SUBHASH
 మధుబాల.. నర్తకిగా ,హీరోయిన్ గా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన నటి. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు ఉండడం, డేటింగ్ లు చేయడం, మధ్యలోనే కొన్ని అనివార్య కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి తరచూ వింటూనే ఉన్నాం..చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి బ్రేకప్ చెప్పే విషయాలు ఈనాటివి కాదు.. గత దశాబ్దాల నుండి  ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు దుమారం రేపుతూ, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక లవ్ జంట ఏదైనా ఉంది అంటే , అది మధుబాల -  దిలీప్ కుమార్ ల జంట అని చెప్పవచ్చు. అప్ప‌ట్లో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా అంటే పెద్ద సంచ‌ల‌న‌మే..!
1948 లో మధుబాల లాల్ దుపట్టా అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత సంవత్సరంలో మహల్ అనే సినిమాలో నటించి, సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది . ఈమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అదే సమయంలో నే బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో గా చలామణి అవుతున్న దిలీప్ కుమార్ తో ప్రేమలో పడింది. దిలీప్‌ను మ‌ధుబాల పీక‌ల్లోతూ ప్రేమ‌తో ముంచెత్తేసింది.
1951 సంవత్సరానికి మధుబాల అంతర్జాతీయంగా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక 1954వ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా వీరిద్దరూ అప్పట్లో డేటింగ్ లో కూడా ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చాలా గట్టిగా వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి బంధం బ్రేకప్ అయింది. ఇక 1969 వ సంవత్సరంలో ఆమె గుండెకు చిల్లు పడడంతో మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: