గెటప్ శ్రీను జబర్దస్త్ షో కి ఎందుకు రావడం లేదు తెలుసా..?

Divya

ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలామంది కమెడియన్లు పుట్టుకొచ్చారు. ఇందులోనే ఎక్స్ ట్రా  జబర్దస్త్ కూడా పుట్టుకొచ్చింది. అయితే అందులో సుడిగాలి సుధీర్ టీం కి  ప్రేక్షకాదరణ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే అందులో వేరే వేరే గెటప్లతో అందరినీ నవ్వించి, ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తున్న గెటప్ శీను గురించి అందరికీ తెలిసిందే. తను నటన పరంగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు.. అయితే ఈ మధ్య  గెటప్ శీను ఈ షో లో కనిపించడం లేదు. అయితే ఎందుకో ఒకసారి తెలుసుకుందాం.

ఈ షో ద్వారా హీరోలైన కమెడియన్స్ కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా సుధీర్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇందులోని కమెడియన్స్, సినిమాలలో కూడా  కమెడియన్స్ గా నటిస్తున్నారు. ఇక గెటప్ శీను జబర్దస్త్ షో కు దూరమయ్యాడు అనే వార్తలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా గెటప్ శీను.. తన కొడుకు తో పాటు మరి కొంత మంది  కమెడియన్స్ ని తన వెంట తీసుకొని వెళ్తున్నారనే వార్తలు కూడా బాగానే వస్తున్నాయి.

ఈ విషయాలపై గెటప్ శీను స్పందిస్తూ.. నేను జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళేది లేదు.. మాకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో.ఈ షో ని నమ్ముకొనే మేమంతా బ్రతుకుతున్నామ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షో ను వదిలి వెళ్ళను.. ఈ మధ్య జట్టులో అందరికీ కరోనా పాజిటివ్ రావడంతో.. నేను రాపిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది అని తెలిపారు.

అయితే వైద్య నిపుణులు మాత్రం ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని తెలిపారు.. ఈ కారణంగానే ఈ షో లో చేయడం లేదని తెలిపారు.. కారణం లేకుండా తనపై చేస్తున్న ఆరోపణలను మానుకోవాలి అంటున్నాడు గెటప్ శీను గారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: