నాగార్జునకు కోపం తెప్పించిన సమంత..!

N.ANJI
అక్కినేని సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేవారి కోడలైంది. పెళ్లి తరవాత కూడా సమంత సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే స్టార్ హీరో నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో నాగార్జున ముందువరసలో ఉంటారు.
సమంత నటించిన ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నాగార్జునకు కోపం తెప్పించిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మ్యాన్ 2 అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత పాత్ర వల్లే ఈ వివాదం పెద్దదవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించగా ట్రైలర్ లో ఉన్న విధంగానే సినిమాలో పాత్ర ఉంటుందని కచ్చితంగా చెప్పలేము.
ఇక ఆమె పాత్ర గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాల ద్వారా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని సమంత తొలి వెబ్ సిరీస్ తోనే వివాదంలో చిక్కుకోవడం నాగార్జున అసహనానికి కారణమైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సమంతను ట్రోల్ చేస్తున్న వారి విషయంలో కూడా నాగార్జున తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. కోడలిపై ట్రోలింగ్ తో నాగార్జున టెన్షన్ పడుతున్నారని సమంత వివాదాస్పద పాత్రలో నటించడం నాగార్జునకు నచ్చలేదని తెలుస్తోంది.
కాగా, మరోవైపు అక్కినేని అభిమానుల నుంచి కూడా ఇవే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎంచుకోవడంలో తప్పు లేకపోయినా ఇలాంటి పాత్రలు మాత్రం వద్దని ఫ్యాన్స్ సూచనలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత ఇకపై పాత్రల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: