వకీల్ సాబ్ సినిమాపై చెప్పుడు చెయ్యని శృతి హాసన్.. కారణం అదేనా..?
వకీల్ సాబ్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరు ఇది. దీని వెనుక కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ముందు నుంచే విడుదలకు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక, ఎన్నో అంచనాల నడుమ 'వకీల్ సాబ్' మూవీ ఈరోజు విడుదలైంది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.
ముందుగా ప్రకటించినట్లుగానే ‘వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, యూఎస్ సహా విదేశాల్లో మనకంటే ముందుగానే ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్పెషల్, బెనిఫిట్ షోలు పడలేదు. కానీ, తెలంగాణలో ప్రదర్శితం అయ్యాయి. ఇక, 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో రిలీజ్ అయింది.తమ అభిమాని అయిన పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూసారు. అయితే ఈ వకీల్ సాబ్ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించి నప్పటికీ పవన్ కళ్యాణ్ చేసిన పాత్ర ప్రేక్షకులను అంత మెప్పించింది.వకీల్ సాబ్ సినిమా కు సంబందించి ఎటువంటి ట్వీట్స్ కాని,ఇంస్టాగ్రామ్ పోస్ట్ కానీ రాయలేదు.అయితే ఈ సినిమా చూసిన వారంతా శృతి హాసన్ పాత్రను మర్చి పోయారు. మొత్తంగా చూసుకుంటే వకీల్ సాబ్ సినిమాలో అభిమానుల అందరు కూడా పవన్ కళ్యాణ్ పాత్ర లో లేనమై పోయారు.