ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!
దీనిపై ఇప్పటికే ప్రజలకు మంచి అవగాహన ఉండడంతో విడుదలయ్యాక సులభంగా క్లిక్ అవుతుంది అనే నమ్మకం ఉంది. కరోనా తరువాత ప్రస్తుతం అన్ని సినిమాలు థియేటర్లోనే విడుదల అవుతున్నాయి. ఈ చిత్ర యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా ఓ టీ టీ లోనే విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. వెబ్ సెరీస్ లో ఇదైతే చూశామో దానికి మించి ఆసక్తికరంగా కథనాన్ని మలిచారని డైరెక్టర్ చెబుతున్నారు.
ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బులు కోసం ఒక బిలియనీర్ గా మార్పు చెందే క్రమంలో ఆర్థిక వ్యవస్థను మరియు సమాజాన్ని ఈ విధంగా వాడుకున్నాడో ...అలాగే స్టాక్ మార్కెట్ ని తన బుద్ధి బలముతో ఎలా శాసించాడో, అలాగే చివరికి ఎలా పతనమయ్యాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాత్రలో అభిషేక్ బచ్చన్ మరియు లేడీ జర్నలిస్ట్ పాత్రలో ఇలియానా నటించారు. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. స్టార్ కాస్టింగ్ తో వస్తున్నందున ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకోనుందో తెలియాల్సి ఉంది.