బిగ్బాస్ విన్నర్ ఇంట్లో తీవ్ర విషాదం..!
హిందీ బిగ్బాస్ ఏడో సీజన్ విన్నర్ గౌహర్ ఖాన్ తండ్రి తీవ్ర అస్వస్థకు గురికాడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. ఇటీవలే గౌహర్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి చేయి పట్టుకొని ఉన్న నా జీవితం నా పప్పా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. గత కొన్ని రోజుల క్రితం గౌహర్ ఖాన్ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో గౌహర్ తన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని తండ్రి దగ్గరే ఉండిపోయింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం గౌహర్ ఖాన్ తండ్రి మరణించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది గౌహర్ ఖాన్. నా హీరో. మీలాంటి వ్యక్తి ఎవరు ఉండరు. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న ఒక దేవదూతగా వెళ్లిపోయాడు. అల్హాముదుల్లా. నా జీవితానికి అర్థం మానాన్న. ఫరెవర్ మై పప్పా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు నాలోనే ఉన్నారు పప్పా. #MyForeverShiningStar అంటూ రాసుకోచ్చింది. ఇక తన వివాహంలో తనను తన తండ్రి ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది గౌహర్. తండ్రి మరణించిన విషయాన్ని షేర్ చేయగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఈ బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను డిసెంబర్ 25న పెళ్లాడింది.