పెళ్ళి చేసుకోక ముందు శ్రీదేవి ఎవర్ని ప్రేమించిందో తెలుసా..??
ఆ ఇద్దరూ జంటగా బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోయినా.. సోర్స్ ద్వారా పేజ్ త్రీ ఆ నిప్పు అందుకుంది.. రూమర్స్, గాసిప్స్ పొగను వదిలింది.శ్రీదేవిని సైలెంట్‌గా, సీక్రేట్‌గా ఆరాధించసాగాడు నిర్మాత బోనీ కపూర్. అప్పటికే మిథున్, బోనీ మంచి ఫ్రెండ్స్. శ్రీదేవి పరిచయం నాటికే ఇటు మిథున్‌కు యోగితా బాలితో, అటు బోనీకి మోనాతో పెళ్లిళ్లయ్యాయి. రెండు జంటలూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లోనే ఉన్నాయి.రోజులు గడుస్తున్నాయి. మిథున్, శ్రీదేవిల మధ్య అనుబంధం పెరుగుతోంది... 'పెళ్లి చేసుకుందాం' అని చెప్పాడు శ్రీదేవితో. శ్రీదేవితో తన ప్రేమను వెలిబుచ్చినప్పుడే 'యోగితాకు విడాకులిస్తున్నాను'అనీ చెప్పాడు. అందుకే మిథున్ నోటెంట పెళ్లి ప్రస్తావన రాగానే విడాకులు మంజూరయ్యాయేమో అనుకుంది.
ఇంకొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అడిగింది శ్రీదేవి.. మిథున్‌ను 'మీ లైఫ్‌లో రెండో స్త్రీగా ఉండలేను. విడాకులు ఎంతవరకు వచ్చాయి?' అని. అతణ్ణించి స్పష్టమైన జవాబు రాలేదు కాని ఓ అనుమానం బయటకు వచ్చింది. బోనీకీ శ్రీదేవి అంటే ఇష్టం అన్న సంగతి మిథున్‌కి అర్థమైంది. శ్రీదేవీకీ ఆ విషయం తెలుసేమో.. తెలిసీ తేల్చట్లేదేమో అన్నదే ఆ శంక. శ్రీదేవి ముందు అనేశాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఆమెకు బోనీ కపూర్ కుటుంబంతో ఉన్న చనువుతో మిథున్ అనుమానాన్ని తీర్చేయాలనుకుంది. ఆ రాఖీ పౌర్ణిమ రోజు బోనీ కపూర్ వాళ్లింటికి వెళ్లి బోనీ చేతికి రాఖీ కట్టేసింది. మిథున్ చింతను దూరం చేసింది శ్రీదేవి...!!