ఆ రోజు బుల్లెట్ భాస్కర్ లేకపోయింటే : జబర్దస్త్ నరేష్

Divya

జబర్దస్త్ నరేష్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఏ షో లో అయినా నరేష్ కనిపించాడు అంటే చాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా ఆ షో లను  చూస్తుంటారు. కేవలం నరేష్ మాత్రమే కాదు "జబర్దస్త్ కామెడీ  షో " నుంచి బయటకు వచ్చి ఎంతో మంది ఆణిముత్యాల లాంటి నటులు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక నరేష్ విషయానికొస్తే చూడడానికి మూడడుగులు ఉన్నప్పటికీ మనోడు వేసే డైలాగులు మాత్రం నాటుబాంబులు పేలిపోతుంటాయి.
ఇక నరేష్ జీవిత విషయానికొస్తే చూడడానికి పొట్టిగా ఉన్నప్పటికీ అతని వయస్సు  మాత్రం 20 సంవత్సరాలు.
ఈ 20 ఏళ్ల కుర్రాడు చూడ్డానికి మాత్రం ఐదేళ్ళ పిల్లాడిలా ఉంటారు. నరేష్ లో ఉన్న జన్యు లోపం కారణంగా అతని ఎదుగుదల ఆగిపోయింది.ఆ లోపమే నరేష్ కు ఒక అదృష్టంగా మారింది . ప్రస్తుతం నరేష్ కెరియర్ మంచి దూకుడు మీద వుంది.వరుస ఈవెంట్స్ చేస్తూ, షోలు చేసుకుంటూ, జబర్దస్త్ లాంటి ఎన్నో షోలను  చేస్తూ బిజీగా ఉంటున్నాడు.
ఇక  ఇన్ని షోలు, ప్రోగ్రాం లు చేస్తూ బిజీగా ఉన్న నరేష్, రెండు చేతుల నిండా సంపాదించుకుంటున్నాడు. ఇక తన ఇంటి పెద్దగా,తన కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తున్నాడు. నరేష్  జీవితంలో తను ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం కొన్ని సంఘటనల కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాడు . తన జీవితంలో తొలిసారి అమెరికా ఈవెంట్ కు వెళ్లాల్సి వచ్చింది. అలా అమెరికా వెళ్లే క్రమంలో అంతకుముందే వారి తాతయ్య చనిపోయారు. ఆ సమయంలో అంత్యక్రియలు చేయడానికి  కూడా చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన బుల్లెట్ భాస్కర్ ఆ విషయాన్ని తెలుసుకుని నరేష్ కు ఆసరాగా నిలిచారు. అమెరికా ఈవెంట్ కు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ  వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేచేశానంటాడు. కరోనా టైం లో ఓ యూ ట్యూబ్ ఛానెల్ తో కలిసి తన హోమ్ టూర్ వీడియో చేశాడు. అందులో భాగంగానే తన ఇంట్లో వున్న సామాన్లతోపాటు తనకు వచ్చిన ట్రోఫీ లను కూడా చూపించాడు.నటుడుకి డబ్బుల కంటే కూడా ప్రోత్సహకంగా వచ్చే ఈ ట్రోఫీ లే ఎంతో ఆనందాన్ని ఇస్తాయంటారు. ఏదైమైనా భాస్కర్ తన జీవితంలో చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేనంటాడు నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: