చిన్నారి పెళ్లికూతురిని ఇలా చూసి షాక్ అవుతున్నారు..!

shami
బాలికా వధు.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఆ క్రేజ్ తో తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడికి మంచి ఛాన్సులు వచ్చాయి. అయితే మొదటి సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే అవకాశాల్లో ఏది తమ కెరియర్ ను నిలబెడుతుంది అన్న ఆలోచనతో సినిమాలు కమిట్ అవ్వాల్సి ఉంటుంది.
సినిమాలైతే చేసింది కాని అవికా గోర్ ఆశించిన స్థాయిలో తెలుగులో క్రేజ్ తెచ్చుకోలేదు. అందుకే అమ్మడు కొద్దిపాటి గ్యాప్ తీసుకుంది. తనకు అవకాశాలు రావడం వెనక తన లుక్ కూడా ఒక కారణమని అనుకున్న అమ్మడు పూర్తి మేకోవర్ తో అందరికి షాక్ ఇచ్చింది. సైజ్ జీరో లుక్ తో అవికా గోర్ ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. తనని అలా చూసిన వారంతా మనం చూస్తుంది ఒకప్పటి అవికా గోర్ నేనా అనేలా షాక్ ఇచ్చింది.
ఇన్నాళ్లు హోంలీ క్యారక్టర్స్ చేస్తూ వచ్చిన అవికా గోర్ ఇక మీదట బికినీ ట్రీట్ లకు సిద్ధమని హింట్ ఇస్తుంది. తన సోషల్ బ్లాగుల్లో బికినీ ఫోటోలతో అమ్మడు అదరగొడుతుంది. అవికా గోర్ ఈ ట్రాన్స్ఫర్ మేషన్ ను ఆమె ఫాలోవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసిన అమ్మడు సినీ కెరియర్ మీద దృష్టిపెట్టినట్టు ఉంది. అందుకే ఇక మీద గ్లామర్ షోకి కూడా రెడీ అని చెప్పేలా తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. మరి అవినా గోర్ చేస్తున్న ఈ కష్టాన్ని గుర్తించి ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: