ప్రభాస్ కి జోడిగా రౌడీ బేబీ.. లీక్ చేసిన డార్లింగ్..!!
ఇటీవలే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై..ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ ని కనబరిచింది...ఈ సినిమాలో ప్రభాస్ ఓ మాఫియా డాన్ గా కనిపించనున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.. ఇక రాధే శ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత.. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శరవేగంగా సినిమాను పూర్తి చేయడానికి డేట్స్‌ను కూడా కేటాయించేశాడట.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా సాయి పల్లవి నటించనుందని బలంగా ప్రచారం జరుగుతోంది.
అంత బలంగా ప్రచారం జరగడానికి కారణం ప్రభాసే అని చెప్పాలి.ఎందుకంటే, ప్రేమమ్ గర్ల్‌తో హైట్ ప్రాబ్లమ్ లేకుంటే. తనకు పక్కాగా సరిపోతుందని డార్లింగే హింట్ ఇచ్చారు.మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్-సాయిపల్లవి జోడీపై ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ క్రమంలోనే సలార్‌లో ఓ హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనుందని టాక్. ఒకవేల ఇదే నిజమైతే సాయిపల్లవి ఫస్ట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. అలాగే సాయిపల్లవికి కేరళ, తమిళనాడులో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది..దీన్ని క్యాష్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ఈ సినిమాలో సాయి పల్లవిని ప్రభాస్ కు జోడిగా ఎంపిక చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి...!!