కెరియర్ ముగిసిందనుకున్న టైం లో లక్కీ ఛాన్స్.. అవికా గోర్ ఫేట్ మారేనా..?

shami
తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన అవికా గోర్ ఆ క్రేజ్ తోనే హీరోయిన్ గా కూడా ఛాన్సులు అందుకుంది. ఉయ్యాల జంపాల సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అవికా గోర్ కెరియర్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. యువ హీరోల సరసన నటిస్తూ వచ్చిన అవికా కెరియర్ టర్న్ తిప్పే ఒక్క పాత్ర కూడా చేయలేదు.
తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించిన ఈ హీరోయిన్ తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డది. అయితే గ్లామర్ షో విషయం లో కూడా కొద్దిగా వెనకడుగు వేసిన అవికా ఈమధ్య తన స్లిం లుక్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో దాదాపు కెరియర్ ముగిసింది అనుకునే టైం లో అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది అవికా గోర్.
ఆమెకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కూడా అన్నపూర్ణ బ్యానరే.. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ కూడా చైతు సరసన ఛాన్స్ దక్కింది. విక్రం కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న థ్యాక్యూ సినిమాలో హీరోయిన్ గా అవికా గోర్ కు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. అవికా గోర్ కు నిజంగానే ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. అమ్మడి ఫేట్ ఈ సినిమాతో అయినా మారుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: