అనసూయ, రష్మి పనికిరాట్లే.. జబర్దస్త్ ఊపేస్తున్న కొత్త భామ..!

shami
జబర్దస్త్, ఎక్స్ ట్రీ జబర్దస్త్ లో కమెడియన్లు వేసే స్కిట్స్ ఎంత ఫేమస్సో.. యాంకర్లుగా చేస్తున్న అనసూయ, రష్మిలు కూడా అంతే ఫేమస్సు. జబర్దస్త్ యాంకర్లుగా వీరు చేసే గ్లామర్ షో అదిరిపోతుంది. ఏడేళ్ల జబర్దస్త్ షో పాపులర్ అయ్యేందుకు యాంకర్ల కంట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది. షోలో ఎవరైనా లేడీ కంటెస్టంట్స్ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళడమే కాని వీరిద్దరికి పోటీ ఇచ్చే వారు కాదు. ఇక జడ్జ్ గా ఎవర్గ్రీన్ రోజా కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది.
లేటెస్ట్ గా జబర్దస్త్ లో ఓ కొత్త భామ సందడి చేస్తుంది. ఆమె పేరు వర్ష. హైపర్ ఆది టీం నుండి వెంకీ మంకీస్ టీం వరకు అందరి స్కిట్స్ లో ఆమె సందడి చేస్తుంది. రీసెంట్ గా రాకింగ్ రాజేష్ స్కిట్ లో కూడా మరదలి పాత్రలో అలరించింది వర్ష. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ రెండిటిలో ఫీమేల్ క్యారక్టర్ కి కూడా మగాళ్ళే వేషాలు వేసుకుని చేసే వారు కాని ఇప్పుడిప్పుడే ఆ పంథా మార్చేస్తున్నారు. ఆల్రెడె చంద్రా టీం లో సత్య శ్రీ క్రేజీ కంటెస్టంట్ గా మారింది.
ఇక ఇప్పుడు వర్ష అందరి స్కిట్స్ లో కనిపిస్తూ అలరిస్తుంది. జబర్దస్త్ ద్వారా వర్ష పాపులర్ అవ్వాలని చూస్తుంది. ఆమె కనిపించే స్కిట్స్ అన్ని సూపర్ అంటున్నారు ఆడియెన్స్. పర్ఫార్మెన్స్ మ్యాటర్ ఎలా ఉన్నా లేడీ గెటప్ లో జెంట్స్ ను చూడటం కన్నా ఇలా వర్ష లాంటి అందమైన భామలను చూడటానికి ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. మొత్తానికి జబర్దస్త్ లో కొత్త పిల్ల హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.                             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: