500 కోట్ల బడ్జెట్ కేవలం 120 రోజుల్లోనా.. ఎలా కుదిరిద్ది బాసు..!
500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా కేవలం 120 రోజుల్లో పూర్తి చేసేలా స్కెచ్ వేశారట డైరక్టర్ ఓం రౌత్. ఆ సినిమా కథ ఏంటో.. పెట్టె బడ్జెట్ ఏంటి.. తీయాలనుకునే రోజులు ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఓం రౌత్ పక్కా ప్లానింగ్ తోనే ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారట. సినిమా మొత్తం ఇండోర్ లోనే షూట్ చేస్తారట. కొన్ని సీన్స్ మాత్రమే అవుట్ డోర్ లో చేయాల్సి వస్తుందట. అందుకే సినిమాను అనుకున్న 120 రోజుల్లో పూర్తి చేస్తామని చిత్రయూనిట్ చెబుతుంది.
జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి జూన్, జూలై కల్లా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తుంటే సీతగా ఎవరు చేస్తారా అన్న ఆసక్తి మొదలైంది. అంతేకాదు సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ మీద కూడా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ పై తన స్టామినా ప్రూవ్ చేసుకోనున్నాడు ప్రభాస్.