ఈనెల 7 లేదా8వ తారీకు లో ఫ్లై ఓవర్ ప్రారంభించే అవకాశం

Sashank Saurabh
దుర్గ గుడి ఫ్లైఓవర్ కోసం విజయవాడ వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే అయితే దాదాపు నాలుగేళ్ల నుంచి నిర్మాణం జరుపుకుంటున్న ఈ ఫ్లైఓవర్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి కూడా వాయిదా పడింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలు నిర్వహిస్తున్నారు. దీనితో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 7 లేదా8వ తారీకు లో ఫ్లై ఓవర్ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లైఓవర్ ని ప్రారంభించాలి అని విజయవాడఎంపీకేశినేని నానికేంద్ర రోడ్లు రవాణా శాఖమంత్రినితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నెల నాలుగో తారీఖున ఫ్లైఓవర్లు ప్రారంభించాల్సి ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు..

Find Out More:

Related Articles: