మేనేజర్ మీద కస్సు బుస్సులాడుతున్న స్టార్ హీరోయిన్..!

shami
ఆమె ఒక స్టార్ హీరోయిన్.. చిన్న సినిమాలతో మొదలైన ఆమె ప్రయాణం స్టార్స్ తో జోడీ కట్టే వరకు వెళ్లింది. రెండు మూడేళ్ళ క్రితం వరకు సక్సెస్ ఫుల్ ఫామ్ కొనసాగించిన ఈ అమ్మడు సడెన్ గా కెరియర్ లో వెంకపడ్డది. స్టార్ హీరోతో ఓ బైలింగ్వల్ మూవీ చేసిన అమ్మడు ఆ సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ కెరియర్ మీద పడ్డది. ఆ తర్వాత ఓ సీనియర్ స్టార్ తో సినిమా చేసేసరికి ఆ సినిమాలో అమ్మడి నటనకు మైనస్ మార్కులు పడ్డాయి.
ఫైనల్ ఆ ఆమెతో జోడీ కట్టేందుకు స్టార్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈమధ్య హైదరాబాద్ ఖాళీ చేసి ముంబై చెక్కేసిన ఈ అమ్మడు మళ్ళీ ఇక్కడ సినిమాల కోసం వచ్చిందని తెలుస్తుంది. రావడం రావడమే తన మేనేజర్ ను ఓ రేంజ్ లో తిట్టేసిందట. మిగతా హీరోయిన్స్ కు వస్తున్నట్టుగా తనకు ఎందుకు ఆఫర్లు రావట్లేదని అడిగిందట.
ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అని మేనేజర్ ద్వాతా దర్శక నిర్మాతలకు కబురు పంపుతుందట. ఎలాగైనా ఒక స్టార్ సినిమా అయినా చేజిక్కించుకోవాలని చూస్తుందట. అమ్మడికి ఆ లక్కీ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అవుతారో చూడాలి. మొత్తానికి స్టార్ గా ఎదిగిన ఈ హీరోయిన్ చేతిలో ఛాన్సులు లేకపోయే సరికి మేనేజర్ ను పిలిచి చీవాట్లు పెట్టిందట. అందరు చేసినట్టుగానే తను కూడా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నా కదా అయినా ఎందుకు ఆఫర్లు రావట్లేదని వాపోయిందట. మొత్తానికి హీరోయిన్ కొద్ద్గా నిరాశలో ఉందని చెప్పొచ్చు. త్వరలోనే ఆమెకు మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: