సుధీర్, రష్మిల జోడీగా సినిమా.. వెయిటింగ్ ఎందుకంటే..!

shami

యూట్యూబ్ హాట్ జోడీగా క్రేజ్ తెచ్చుకున్న సుధీర్, రష్మి బుల్లితెర మీద తమ హవా కొనసాగిస్తున్నారు. ఎలాంటి షో అయినా సరే వీరిద్దరు కనిపిస్తే చాలు అది సూపర్ హిట్ అయినట్టే. సుధీర్, రష్మిలది ఎప్పటికి క్రేజీ జోడీనే జబర్దస్త్ నుండి ఢీ షో వరకు వీరు చేసే రొమాంటిక్ కామెడీ ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఇద్దరు కలిసి షో చేస్తేనే ఇలా ఉంటే ఇక సినిమాలో నటిస్తే. 

 

ఈమధ్యనే సుధీర్ హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. సుధీర్ హీరోగా అంటే హీరోయిన్ గా రష్మిని ఊహించుకోవడం కామనే. హీరోగా సుధీర్ చేసిన ఆ ప్రాజెక్ట్ కు రష్మి డేట్స్ అడ్జెస్ట్ కాలేదట. అందుకే రష్మి ప్లేస్ లో ధన్య బాలకృష్ణని తీసుకున్నారు. లేటెస్ట్ గా ఓ టాక్ షోలో పాల్గొన్న సుధీర్, రష్మిలు ఇద్దరు కలిసి సినిమా చేయాలంటే అది అద్భుతమైన కథ కుదరాలని. మా ఇద్దరి జోడీకి తగిన ప్రాధాన్యత కలిగిన కథ వస్తే తప్పకుండా కలిసి సినిమా చేస్తామని అంటున్నాడు సుధీర్.

 

సుధీర్, రష్మిలను పెట్టి సినిమా చేయాలని చాలామంది ముందుకొస్తున్నా.. సరైన కథ లేనిదే ఇద్దరం కలిసి చేసినా వేస్ట్ అని తానే వద్దని చెబుతున్నానని అన్నాడు సుధీర్. హీరోగా చేస్తున్నా సరే జబర్దస్త్ షోని మిగతా హీరోల సినిమాల్లో అవకాశాలను వదులుకునేది లేదని అంటున్నాడు సుధీర్. మొత్తానికి తనది హీరో కటౌట్ అంటూ స్కిట్స్ లో చెప్పుకునే సుధీర్ నిజంగానే హీరోగా మారి సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే మొదటి రెండు ప్రయత్నాలు విఫలమవగా రాబోయే సినిమాలైనా సరే హిట్టు కొడతాడేమో చూడాలి.                                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: