అల వైకుంఠపురములోకు పవన్ సెగ.. తడాఖా చూపిస్తారట..!

shami

అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్న టైం నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను సెపరేట్ చేశారన్న మాట బాగా వినిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఇద్దరు కలవడం మాట్లాడటం జరిగింది.. ఎలక్షన్స్ లో బన్ని జనసేన ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే సోమవారం జరిగిన అల వైకుంఠపురములో ఈవెంట్ లో పవన్ పేరుని మొక్కుబడిగా చెప్పి మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి కారకుడయ్యాడు బన్ని. పవర్ స్టార్ పవర్ స్టార్ అనే కేకలు వినిపించగా పవన్ పేరుని మాట వరసకే ప్రస్థావించిన అల్లు అర్జున్ ఆ వెంటనే చిరు అంటే నాకి ప్రాణం ఈ కట్టె కాలేవరకు నేను చిరంజీవి అభిమానినే అనేశాడు.

 

అయితే పవన్ మీద కోపంతోనే పవర్ స్టార్ కేకలేయగానే చిరు పేరెత్తి వారిని సైలెంట్ అయ్యేలా చేశాడు అల్లు అర్జున్. పవన్ తో ఈ వ్యతిరేకత లోపల ఎలా ఉన్నా ఫ్యాన్స్ మధ్య మాత్రం చాలా గట్టిగా కనబడుతుంది. అప్పట్లో చెప్పను బ్రదర్ అన్నాడనే డిజే, నా పేరు సూర్య సినిమాలను పవన్ ఫ్యాన్స్ బాయ్ కాట్ చేశారు. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ తడాఖా చూపిస్తామని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది పక్కన పెడితే పవన్ మీద మరోసారి బన్ని చూపించిన అశ్రద్ధ సినిమా రిజల్ట్ మీద పడబోతుందని కొందరు అంటున్నారు.

 

అంతేకాదు మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ చీలికలు అన్న విధంగా ప్రస్తుతం పరిస్థితులు కనడుతున్నయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. అల్లుడు సినిమాను కాదని అక్కడకు వెళ్లినా సరే బన్ని నేను ఎప్పటికి చిరంజీవి అభిమానినే అని చెప్పారు. కాని పవన్ కళ్యాణ్ గురించి మాత్రం మాట్లాడటానికి వెనుకడుగు వేస్తున్నాడు. మరి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడాలంటే మళ్లీ పవన్, బన్ని కలిసి కనిపించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: