రాజమౌళి మహాభారతం... ఎలా ఉండబోతుందంటే...

frame రాజమౌళి మహాభారతం... ఎలా ఉండబోతుందంటే...

Balachander

రాజమౌళి సినిమా సినిమాకు భారీ తన స్టామినా పెంచుకుంటున్నాడు.  తనపై అభిమానులు పెట్టుకుంటున్న అంచనాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.  బాహుబలి తరువాత ఈ అంచనాలు మరింతగా పెరిగాయని చూపొచ్చు.  బాహుబలి ఐదేళ్లు తీశారు.  రెండు భాగాలుగా తీశారు.  అయితే, ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఒకటే పార్ట్ ఉంటుంది.  


ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 70శాతం వరకు కంప్లీట్ అయ్యింది.  మరో 30 శాతం మాత్రమే పెండింగ్ ఉన్నది.  ఈ 30శాతం పెండింగ్ షూటింగ్ కూడా ఫాస్ట్ గా తీస్తున్నారు.  వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్ కంప్లీట్ చేస్తారట.  ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు, గ్రాఫిక్స్ ఉంటాయి.  వీటికే ఎక్కువ సమయం తీసుకుంటుంది.  ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే విషయం తెలియడం లేదు.  


అయితే, రాజమౌళి మహాభారతం తీయాలని అనుకుంటున్నారని మాత్రం తెలుస్తోంది.  ఇది ఎప్పుడు తీస్తారు అనే విషయం ఇంకా తెలియదు.  అయితే, మహాభారతం తీస్తే ఒక పార్ట్ లో తీయరట.  అనేక పార్టులుగా సినిమా తీసారట.  దీనికోసం భారీ ఖర్చు కూడా అవుతుందని రాజమౌళి చెప్తున్నారు. ఒకవేళ మహాభారతం తీస్తే అందులో ఎక్కువగా కొత్తవారిని తీసుకుంటానని అంటున్నారు రాజమౌళి.  


మహాభారతం సినిమాలో ఒక పాత్రలో రాజమౌళి కూడా కనిపిస్తారట.  అయితే, అది ఒక్కఎపిసోడ్ లో కాకుండా సినిమా మొత్తం కనిపించేలా ప్లాన్ చేసుకుంటాడట.  రాజమౌళి ఒకవైపు తన సినిమా తీస్తూనే తన అన్న కీరవాణి కొడుకు నటించిన మత్తు వదలరా సినిమాను ప్రోమోట్ చేస్తున్నారు.  ఈ సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రమోట్ చేస్తున్నారు.  ఇందులో ఇటీవలే ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.  ఆ ఇంటర్వ్యూలోనే రాజమౌళి ఈ విషయాలు చెప్పారు.  

Find Out More:

Related Articles:

Unable to Load More