బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమిషా పటేల్ తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్.టి.ఆర్, బాలకృష్ణ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అమిషా పటేల్ ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనుకపడి పోయింది. బాలీవుడ్ లో కూడా అమ్మడికి అవకాశాలు లేకుండాపోయాయి.
అందుకే కొత్తగా నిర్మాత అవతారం ఎత్తింది. అయితే అది కూడా పెద్ద వర్క్ అవుట్ అవట్లేదు సరికదా కొత్త చిక్కుల్లో పడేలా చేసింది. అమిషా పటేల్ తనని మోసం చేసిందని ఓ ఫైనాన్షియర్ ఏకంగా కేసు వేశాడు. తను నిర్మాతగా చేస్తున్న సినిమా కోసం అమిషా పటేల్ అజయ్ కుమార్ సింగ్ నుండి 3 కోట్లు అప్పుగా తీసుకుందట.
50 లక్షలు తిరిగి ఇచ్చిన అమిషా 2.5 కోట్లకు కొంత మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చిందట. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో అతను కేసు వేశాడు. జూలై 8న అమిషా కోర్ట్ కు హాజరు కావాల్సిందే అంటూ తీర్పు వచ్చిందట. ఒకవేళ అలా రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. జరిగిన నష్టం ఎలాగు జరిగింది.. అందుకే డబ్బు కోసం ఉన్న పరువు కాస్త పోగొట్టుకుంటే ఎలా చెప్పండి.
అమిషా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సవుతుందో ఏంటో. ఆ వ్యవహారం ఏదో కోర్ట్ కేసు దాకా వెళ్లకుండా సెటిల్ చేసుకుంటే బాగుండేది. హీరోయిన్ గా కెరియర్ దాదాపు ముగిసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య హాట్ ఫోటో షూట్స్ తో అందాల ప్రదర్శన చేస్తుంది. ఫార్టీ ప్లస్ ఏజ్ లో కూడా అదరగొట్టే అందాలతో ప్రేక్షకుల మతులు పోగొడుతున్న ఈ అమ్మడు ఈ కేసు విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.