మళయాల ప్రేమం సినిమాతో బాగా ఫేమస్ అయిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అ ఆతో ముందు ఎంట్రీ ఇవ్వగా తెలుగు ప్రేమం లో తన రోల్ ఇక్కడ కూడా తనే చేసి మెప్పించింది. యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న అనుపమ ప్రస్తుతం కెరియర్ సాఫీగానే సాగుతుంది. అయితే అమ్మడి రేంజ్ కు తగిన హిట్ కొట్టడంలో మాత్రం వెనుకపడింది.
ఈమధ్యనే రాం సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమాతో హిట్ అందుకున్న అనుపమ తనకు ఇష్టమైన మగాడు గురించి చెప్పింది. కాబోయేవాడి గురించి కలలు కనడంలో సెలబ్రిటీస్ కూడా మినాహింపేమీ కాదు. అందుకే తన భర్తకు కావాల్సిన లక్షణాలు ఎలా ఉండాలో చెప్పింది అనుపమ పరమేశ్వరన్.
పైకి చెడ్డవానిలా కనిపించినా మహిళలను మహారాణులుగా చూసుకునే వాడంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ట్విట్టర్ లో ఆమె పెట్టిన ఈ మెసేజ్ ఆమె ఫ్యాన్స్ వైరల్ చేశారు. అయితే అనుపమ చెబుతున్నది తన గురించే అని అభిమానులు రెస్పాన్స్ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం అనుపమ చేతిలో ఒకటి రెండు ఆఫర్లు ఉన్నాయి. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా అనుపమ సినిమాలు చేస్తుంది. సొంత భాషలో కూడా సినిమాలతో బిజీగా ఉంది. ఈమధ్య రాం తో క్లోజ్ గా ఉన్న ఈ అమ్మడు అతనితో సంథింగ్ సంథింగ్ అనిపించేలా ఉన్నా ఆ విషయంపై మాత్రం నోరు విప్పట్లేదు.