లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వచ్చిన సరైనోడు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. బన్ని సక్సెస్ మేనియాను కంటిన్యూ చేస్తూ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు విపరీతంగా నచ్చేసింది.
ఇక సరైనోడు తర్వాత ఏ స్టార్ హీరోనే డైరెక్ట్ చేస్తాడు అనుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఆల్మోస్ట్ సినిమా పూర్తి అయినట్టే అని తెలుస్తుంది. ఇక సినిమాను కూడా సమ్మర్ వార్ లో దించాలని చూస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 5న ఈ సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్ అవుతుంది మరి సరిగ్గా ఆ సినిమా వచ్చిన వారానికే వచ్చి సత్తా చాటాలని చూస్తున్నాడు బోయపాటి. బాహుబలికి పోటీ ఎందుకని మిగతా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటుంటే బెల్లంకొండ హీరో మాత్రం ఢీ కొట్టేందుకు రెడీ అన్నట్టు చూస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా నటిస్తుంది.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే రాబోతుంది. ఓ స్టార్ హీరో మార్క్ సినిమాగా బోయపాటి ఎక్కడ తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడట. మరి అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో దక్కని సూపర్ హిట్ బెల్లంకొండ శ్రీనుకి ఈ సినిమా అయినా ఇస్తుందో చూడాలి.