మనీ: రూ.30వేలతో రూ.3 లక్షల వరకు ఆదాయం.. ఎలా అంటే..?

Divya
మీలో ఎవరైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే.. ఏదైనా సరే లాభసాటిగా ఉండే వ్యాపారం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. ఇక ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక చాలామంది ఈ  విషయంలో ముందడుగు వేయలేకపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన మేము ముందుకు తీసుకు రావడం జరిగింది. ఇక ఈ వ్యాపారంతో వేలల్లో ఖర్చు ఉంటుంది. కానీ ఆదాయం మాత్రం లక్షల్లో వస్తుంది. ఇక ఈ వ్యాపారానికి 30 వేల రూపాయల వరకు మీ దగ్గర ఉండాలి . ఇక చెరువు తవ్వకానికి అయ్యే ఖర్చు అదనంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మీరు చెరువులను వలసిన పని ఉండదు.
ఇంతకు ఆ వ్యాపారం ఏమిటి అంటే ముత్యాల పెంపకం.. ముత్యాల పెంపకం కోసం మీరు కనీసం 30 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. అయితే లాభం మాత్రం మూడు లక్షల వరకు ఉంటుందని గుర్తించాలి. ఇక ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మూడు విషయాలు చాలా అవసరం.. శిక్షణ,  గుల్లలు, చెరువులు.. మీ దగ్గర తగినంత స్థలం ఉంటే చెరువు తవ్వకంలో ప్రభుత్వం మీకు సహాయం కూడా చేస్తుంది. అంతేకాదు మీకి అయిన  ఖర్చు లో 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం గమనార్హం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ముత్యాల పెంపకం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక చివరికి మీకు గుల్లలు అవసరం అవుతాయి. దీనిలో ముత్యాలు తయారు చేయబడతాయి. కాబట్టి బీహార్లోని దర్భంగా మరియు దక్షిణ భారతదేశంలోని మంచి నాణ్యత గల గుల్లలు తెచ్చి పెంచవచ్చు.
ఇక మీరు చేయవలసిన మొదటి పని గుల్ల లను ఒక వలలో కట్టి వాటిని 15 రోజుల పాటు చెరువులో ఉంచాలి. ఇక ఆ తర్వాత అవే తమ  సొంత వాతావరణాన్ని సృష్టించుకుంటాయి. ఇక ఆ తర్వాత దానిని సర్జరీ చేయాలి.. సర్జరీ అంటే గుల్ల లోపల అచ్చు పెట్టడాన్ని సర్జరీ అని అంటారు. దీని తరువాత అచ్చు పై పూత వేయబడుతుంది ఇక ఓస్టేర్ పొరను ఏర్పరచడం వల్ల ఇది ముఖ్యంగా ముత్యంగా మారుతుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఒక ముత్యం ద్వారా 120 రూపాయలకు అమ్ముడు పోతుంది. నాణ్యత ఉంటే 200 రూపాయలకు మించి కూడా వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. ఇక ప్రతి ఓస్టర్ లో మీకు రెండు ముత్యాలు లభిస్తాయి. కాబట్టి  ప్రతి సారి మీరు రూ. 2 నుండి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: