కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ 5 సూత్రాలు పాటించాల్సిందే ?

VAMSI
డబ్బులు సంపాదించాలి అని అన్ని సౌకర్యాలతో లక్సరిగా జీవనం ఉండాలి అని అందరూ అనుకుంటారు. కానీ, కొందరికి మాత్రమే ఆ అదృష్టం దొరుకుతుంది. అందరూ కోరుకున్న జీవితాన్ని, సంతోషకరమైన విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకున్నంత మాత్రాన అన్ని అనుకున్నట్లు జరిగిపోవు. ఎవరో కొందరికి అదృష్టవశాత్తు అనుకోకుండానో లేక వారసత్వంగానో లభిస్తాయి. కానీ చాలా వరకు ఇది మన స్వయం కృషి, సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని నియమాలు పాటించడం వలన కూడా మనం అనుకున్న విధంగా ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అది ఎలాగో ఇపుడు తెలుసుకుందాం పదండి.
డబ్బులను వృదా చేయకూడదు: ఉన్నంతలో సంతోషంగా జీవించాలి అంటే, డబ్బులను వృదా చేయరాదు. కనిపించిన వస్తువల్లా కొనేయడం, అవసరం లేని సౌకర్యాన్ని డబ్బులు పోసి మరి కొనడమో, డాబు కో దర్పానికో పోయి వస్తువులను డబ్బులు పోసి కొనడం వంటివి తగ్గించుకోవాలి.
అప్పులు బెడద ఎపుడు ఉండకూడదు: అవసరానికి మించిన అప్పులు మాత్రమే కాదు, అవసరానికి అప్పులు చేయడం కూడా పొరపాటే. ఎందుకంటే అప్పు అనేది ఎపుడు మన తలపై పెద్ద భారమే. వీలయినంత వరకు అప్పులకు దూరంగా ఉండాలి.  అప్పు అనేది మనిషిని ఎపుడు కూడా ఎదగనివ్వదు. మీరు జాబ్ చేసినా లేదా వ్యాపారం చేసినా అప్పులు మాత్రం పెట్టుకోకండి.
పెట్టుబడి ఉత్తమం : మన దగ్గర అవసరానికి మించి డబ్బులు ఎక్కువగా ఉంటే వాటిని పొదుపు, జాగ్రత్త పేరుతో బ్యాంకు ఎఫ్డీ, సేవింగ్ ఖాతాల్లో ఉంచితే వాటి వల్ల వచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అదే పెట్టుబడి చేస్తే మీరు పెద్ద మొత్తంలో రాబడిని పొందే అవకాశం మెండుగా ఉంటుంది. అయితే సరైన పెట్టుబడి పద్దతులని ఎంపిక చేసుకోవడం ముఖ్యం.
 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ : హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నేటి రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు భరించాలంటే చుక్కలు కనపడుతున్నాయి.  అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: