మనీ: ఫిక్స్ డ్ డిపాజిట్ లు చేసిన వారికి శుభవార్త..!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. బ్యాంకులలో డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక ప్రముఖ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతూ ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు ఆనందాన్ని కలగజేసింది. ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఆక్సిస్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లును సవరించడం జరిగింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెపో రేటు పెంపు తర్వాత ప్రధాన బ్యాంకులు తమ ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఆక్సిస్ బ్యాంకు కూడా తొమ్మిది నెలల కంటే ఎక్కువ కాలవ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారి కోసం సరికొత్త వడ్డీరేట్లను తీసుకురావడం జరిగింది.
మెచ్యూరిటీ కాలాన్నిబట్టి బ్యాంకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచనున్నట్లు సమాచారం. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం అదనంగా 0.50 శాతం అధిక రాబడిని పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు,  ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతూ మే 12 2022 నుంచి అమలులోకి తీసుకు రావడం జరిగింది.  ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తానికి ఎవరైతే డిపాజిట్ చేసి ఉంటారో వారికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు నోటిఫికేషన్ లో తెలియజేయడం గమనార్హం.
ఇక వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే తొమ్మిది నెలల కంటే ఎక్కువ రోజులు  ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో ఇక అక్కడి నుంచి ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు అయితే 2.50 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు అయితే 2.50 శాతం వడ్డీ ప్రకటించారు. ఇక 30 రోజుల నుంచి మూడు నెలల కంటే తక్కువ తీసుకున్న వారు సాధారణ ప్రజలకు అలాగే సీనియర్ సిటిజన్లకు 3.0 శాతం అదనంగా వడ్డీ ఇవ్వనున్నట్లు సమాచారం. సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి సాధారణ ప్రజలకు 5.75 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ పెంచినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: