మనీ: నెలకు రూ.1000 చాలు .. కోటీశ్వరులవడానికి.. ఎలాగంటే..?

Divya
ప్రతి ఒక్కరికి కోటీశ్వరులు కావాలనే ఆశ ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా డబ్బు సంపాదించుకోవడం.. పొదుపు మార్గాన్ని పాటించడం వల్ల కోటీశ్వరులు కావచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే కోటీశ్వరులు కావాలంటే లక్షలకు లక్షలు పోగు చేయాల్సిన అవసరం లేదు. కేవలం వెయ్యి రూపాయలు పొదుపు చేసినా చాలు మీరు కోటీశ్వరులు కావచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. డబ్బులు ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ పెరిగిపోతున్న ఖర్చులతో డబ్బు పొదుపు చేయడం అనేది ఒక కలగానే మిగులుతోంది. డబ్బు పొదుపు చేయాలి అంటే వేలకువేలు పోగు చేయాల్సిన అవసరం ఏమీ లేదు.

నిజంగానే కోటీశ్వరుడు కావాలని ఆలోచిస్తున్నట్టు అయితే నెలకు వెయ్యి రూపాయల చొప్పున పొదుపు చేసినా చాలు కోటీశ్వరులు అవుతారు అని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.. అదే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కోటేశ్వరులవడాని కి బాగా ఉపయోగపడతాయి. అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఎలా పొదుపు చేయాలి అనే విషయాలను తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద దీర్ఘకాలం పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయం ముగిసే సరికి మంచి రిటర్న్స్ లభిస్తాయి.

ఇక మ్యూచువల్ ఫండ్ లో సగటున ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున మీకు రిటర్న్స్ కూడా లభిస్తుంది. ఈ లెక్కన మీరు 30 సంవత్సరాల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పొదుపు చేస్తే రూ.70 లక్షలకు పైగా వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు స్టెప్ అప్ సిప్ అని ఫీచర్ ను అందిస్తున్నాయి.  కాబట్టి ఒక ఏడాది గడిచిన తర్వాత మీరు కొంత శాతం మీ పొదుపు కూడా పెంచాల్సి ఉంటుంది. ఇక మీ ఆదాయం పెరిగినప్పుడు మీ పొదుపు కూడా పెంచితే ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది.. ఇక ప్రతి సంవత్సరం 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయినా మంచి లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: