మనీ: ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపిన జగన్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త ను చెప్పారు. ఏమిటంటే 2022 - 2023 సంవత్సరానికి గాను ఇంటి పన్ను చెల్లింపు పై జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక , మున్సిపాల్టీలు , నగర పంచాయతీలలో ఆస్తిపన్ను ఈ నెల చివరి లోపు చెల్లిస్తే ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ సర్కార్.
ఒకేసారి మొత్తం ఆస్తిపన్ను చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుంది అని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ మేరకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను జగన్ సర్కార్ ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఇంటి పన్ను అలాగే నీటి పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే పాత బకాయిలను మార్చి నెలాఖరు లోపు చెల్లించాలని సూచనలు కూడా చేసింది. దీనిపై మిశ్రమ స్పందన లభించడంతో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలి అని అంతేకాకుండా ఏప్రిల్ చివరి లోపు పూర్తి పన్ను వసూలు కావాలి అని అధికారులను సూచించారు.
అధికారులు కూడా పన్ను వసూలు చేయడం మొదలు పెట్టడంతో కొన్నిచోట్ల దీనిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం గమనార్హం. అంతేకాదు ఆ పన్ను  ఈ పన్ను అంటూ సామాన్యులపై భారం మోపుతున్నారని వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరూ కూడా అన్ని పథకాల నుంచి డబ్బులు పొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక పథకాల పేరిట డబ్బులు ఇస్తూనే మరోవైపు లాక్కుంటున్నారు అని చాలా మంది సామాన్యులు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: