మనీ : రూ.323 తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. కానీ మనుషులకు కాదండోయ్..!!

Divya
సాధారణంగా మనుషులు ఇన్సూరెన్స్ చేసుకోవడం మనం చూసే ఉంటాం.. ఎందుకంటే కుటుంబ పెద్ద మరణించినప్పుడు వారి పైన ఆధారపడే మిగతా వారు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సహాయాన్ని ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అందజేస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా.. ప్రతి సాధారణ పౌరుడు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా హెల్త్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు.. ఇక కేవలం మనుషులకు మాత్రమే కాదు వాహనాలకు, ప్రాపర్టీ లకు కూడా ఇన్సూరెన్స్ లు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే పెంపుడు జంతువులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందని మీకు తెలుసా..? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు మొట్టమొదటిసారి పెట్స్ ఎమర్జెన్సీ కోసం కూడా సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ఆరోగ్య బీమా అయిన ఎఫ్ జి డాగ్ హెల్త్ కవర్ ను తాజాగా ప్రారంభించినట్టు ప్రకటించడం జరిగింది. ఇక మీరు కూడా మీ పెంపుడు కుక్కలకు హెల్త్ ఇన్సూరెన్స్ లో చేయించవచ్చు. ఇక ఈ బీమా కింద మీ పెంపుడు జంతువులను ఆసుపత్రిలో చేర్పించడం, శస్త్రచికిత్స, మరణాలు, అంత్యక్రియలకు ఖర్చు , ప్రాణాంతక అనారోగ్యం వంటివాటికి పాలసీ సహాయపడుతుంది. అంతేకాదు పెంపుడు జంతువులు మరణిస్తే ఈ కవర్ ద్వారా వాటిని పోషించే వారికి పాలసీ డబ్బులు వస్తాయి అన్నమాట.
బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ పెంపుడు జంతువు యొక్క వయసు ఆరు నెలల నుండి నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక కుక్కలకు, చిన్న  జంతువులకు ఏడు సంవత్సరాల వరకు గడువు వర్తిస్తుంది.. ఇక తాజాగా ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన రుచిక మల్హన్ మాట్లాడుతూ పెంపుడు జంతువులు కూడా కుటుంబంలో ఒక భాగం. ముఖ్యంగా మా కస్టమర్లకు జీవితకాల భాగస్వామి అయిన బ్రాండ్గా వారి అభివృద్ధి చెందుతున్న జీవనశైలి అవసరాలకు అనుగుణంగా మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము.. అందుకే పెంపుడు జంతువుల కోసం కూడా ఇలాంటి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చాము అని స్పష్టం చేశారు. ఇందుకోసం మీరు మీ పెంపుడు జంతువు పైన పాలసీ ఓపెన్ చేసి 323 రూపాయలతో పాలసీ కట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: