మనీ : శుభవార్త తెలిపిన ఐసిఐసిఐ.. రూ.22 లక్షలు ఒకేసారి..!!

Divya
ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఇక అందుకు తగ్గట్టుగా ఖచ్చితమైన ఆదాయాన్నిచ్చే పాలసీ కావాలని మీరు భావిస్తున్నారా..? ఇక అలాంటి వారికి చాలా ప్రయోజనాలను అందివ్వడానికి ఐసిఐసిఐ ముందుకు వచ్చింది. వీటిలో మీ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీ అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకుంటారు కాబట్టి ఖచ్చితమైన రాబడి కూడా వస్తుంది. అలాంటి పాలసీలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి.. ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. అదేమిటంటే ఇన్సూరెన్స్ తోపాటు ఖచ్చితమైన రాబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఇక ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గ్యారెంటీ ఇన్కమ్ ఫర్ టుమారో పేరుతో ఒక పాలసీని అందిస్తోంది ఐసిఐసిఐ బ్యాంక్. ఇక ఇందులో మనం చేరడం వల్ల లైఫ్ కవర్ తో పాటు ఖచ్చితమైన రిటర్న్స్ ని కూడా మనం పొందవచ్చు. ఇక ఈ పాలసీ తో 100% గ్యారెంటీ బెనిఫిట్స్ అలాగే లైఫ్ కవరేజ్ ఫెసిలిటీ , టాక్స్ ఫ్రీ రిటర్న్స్ వంటి పలు రకాల ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఎంచుకునే ప్రాతిపదికన ఇందులో డబ్బులను పెట్టుబడిగా పెట్టడం అలాగే మీకు లభించే బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయి.
ప్రీమియం టర్మ్ ఇందులో 5 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన టర్మ్ ఎంచుకొనే అవకాశం కల్పించబడ్డాయి. ఇకపోతే 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఈ పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు మీరు ప్రీమియం చెల్లించవచ్చు.. అంతే కాదు రూ.25 లక్షల వరకూ బీమా పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు 20 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. 10 యేళ్ళ పాటు ప్రీమియం చెల్లించి ఆ తర్వాత వదిలేయాలి. ఇక ఇరవై సంవత్సరాల తర్వాత మీ చేతికి ఒకేసారి 22 లక్షల రూపాయలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: