మనీ : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతం తోపాటు అదనంగా రూ.30 వేలు..!!

Divya
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో చాలా మంది ఉద్యోగులకు ఎన్నో రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.. డి ఏ పెంపు తో సహా ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.. ఉన్నత డిగ్రీ కోసం అదనంగా 30 వేల రూపాయల వరకు ప్లాన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. మీకు ఉన్న డిగ్రీ ప్రాతిపదికన చెల్లించే మొత్తం కూడా మారుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రతి ఏడాది కూడా ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా డియర్ నెస్ అలవెన్స్ రూపంలో ఈ పెరుగుదల ఉద్యోగులకు ఉంటుంది. ఇక ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేమిటంటే ఉన్నత డిగ్రీ పొందిన వారికి ప్రోత్సాహకాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచడం గమనార్హం. ఎవరైనా సరే పీహెచ్డీ వంటి ఉన్నత డిగ్రీలు చేసిన వారికి ప్రోత్సాహక మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ. 30 వేల రూపాయలకు పెంచారు. దీంతో  ఉద్యోగులకు ఊరట కలగ బోతోంది.

ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉన్నత చదువులు చదవడానికి ఉద్యోగులకు ప్రోత్సాహక మొత్తాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల నిబంధనలను సవరించింది.నియమ నిబంధనల ప్రకారం ఉన్నత విద్య చదువుకోవడానికి అందించే ప్రోత్సాహకం లో కేవలం రూ. రెండు వేల నుంచి రూ. 10వేల వరకు మాత్రమే ప్రోత్సాహకం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానిని మారుస్తూ ఏకంగా 30 వేల రూపాయలకు పొడిగించడం గమనార్హం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారికి రూ. 25, 000 పీహెచ్డీ చేసే వారికి 30,000 జీతం తో పాటు  ప్రోత్సాహకాన్ని కూడా అందించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: