మనీ: ఆర్థిక దరిద్రం పట్టుకుందా..?

Divya
ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరాలని.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అలా సంతోషంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఇక అందుకోసమే కష్టపడి డబ్బు సంపాదించి తమ కళను నెరవేర్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ కలలు మాత్రం కలగానే మిగిలిపోతూ ఉంటాయి. ఇందుకు కారణం ఆర్థిక దరిద్రం అని చెబుతున్నారు నిపుణులు. ఇక ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవకపోవడం.. పైగా అప్పులు చేయడం ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతాయి.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా జరుగుతోంది అని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఇకపోతే మనం చేసే ఆ చిన్న పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం గుడికి వెళ్తే దేవుడికి కొబ్బరికాయ కొట్టేముందు కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెట్టి దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టి , మనం కోరికలను కోరుకుంటూ ఉంటాము. ఇక మన కోరికలు నెరవేరడం పక్కనపెడితే అష్టదరిద్రాలు మనల్ని వెంటాడతాయి. అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకు ఎటువంటి బొట్లూ పెట్టకూడదు. ఇక అంతే కాదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పటినుంచో వాడుతూ వస్తున్న వస్తువులను మనం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఏదైనా ఇంట్లో సమస్య జరిగినప్పుడు ఆ వస్తువుల వల్లే సమస్య తలెత్తింది అని కొంత మంది భావిస్తూ ఉంటారు.
ఇక  పాత వస్తువులు వాడటం కూడా దరిద్రమే నట. అయితే చాలామంది కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు వూపుతూ ఉంటారు. ఈ అలవాటు కూడా దరిద్రానికి సంకేత మట. అంతేకాదు మంచం మీద కూర్చుని భోజనం చేయడం కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా దరిద్రాలకు సంకేతాలు అట. ఇక ఈ అలవాట్లు కనుక మీలో ఉంటే కచ్చితంగా ఆర్థిక నష్టాలు తప్పవు. కాబట్టి ఇలాంటి అలవాటు కనుక ఉంటే ఆర్థిక నష్టాలు తప్పవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: