మనీ: కొత్త ఏడాది గ్యాస్ వినియోగదారులకు షాక్..!!

Divya
కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే దేశంలో ప్రతి నెల మొదటి తేదీన కొన్ని మార్పులు, నిబంధనలు,నియమాలు జారీ అవుతున్నట్లు గానే ఈ కొత్త సంవత్సరం కూడా కొన్ని నిబంధనలు మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త సంవత్సరం అన్ని రంగాల వాళ్ళు ఆఫర్ల ప్రకటిస్తూ వినియోగదారులకు శుభవార్త ను కలిగిస్తూ ఉంటే గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఈ కొత్త ఏడాది కొంత వరకు షాక్ తగిలిందని చెప్పవచ్చు. జనవరి 1 2022 నుంచి కొన్ని మార్పులు అమలు కానున్నట్లు సమాచారం. సామాన్య వినియోగదారులకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగనున్నాయి.

ఎల్పిజి సిలిండర్ ధర పై ధరలు పెంచుతూ ప్రతి నెల ఒకటో తేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎల్పిజి సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు గల కారణం ఏమిటంటే..ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చే ఏడాది అనగా మరో రెండు రోజుల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ ను చౌకగా మారుస్తుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

దీపావళికి ముందే ఈ ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ల పెంపుదల చేస్తూ కొంతవరకు ఊరట కలిగించింది. ఎల్పీజీ గ్యాస్ ధర మార్కెట్ ధర కంటే 266 రూపాయలను భారీగా పెంచారు. కానీ దేశీయ ఎల్పిజి సిలిండర్ల లో ఎటువంటి మార్పు లేదని చెప్పవచ్చు. ఇక కమర్షియల్ సిలిండర్ ల విషయానికి వస్తే..ఢిల్లీలో ఒక సిలిండర్ ధర రూ.2 వేలకు పైగానే ఉంది. అంతకు ముందు 1733 రూపాయలు గా ఉండే ఈ సిలిండర్ ధర ఇప్పుడు రెండు వేలకు పైగా ఎగబాకడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది.

ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1683..19 కేజీల సిలిండర్ ప్రస్తుతం రూ.1950 కి లభిస్తోంది. చెన్నై లో అయితే 19 కేజీల సిలిండర్ ధర రూ.2133 వుండగా.. కోల్ కతాలో రూ.2073.50 గా నమోదు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: