మనీ: పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలో రూ.23.34 కోట్ల వడ్డీ జమ..!!

Divya
పిఎఫ్ ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త శుభవార్తలు తీసుకొస్తోంది ఎంప్లాయ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్. మీరు ప్రభుత్వ , ప్రైవేటు రంగాలలో పని చేస్తున్నారా..?ముఖ్యంగా మీరు కూడా ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ లో ఖాతాదారుడు గా ఉన్నారా..? ప్రతి నెల మీకు వచ్చే శాలరీ లో పిఎఫ్ కోసం కొంత డబ్బు కట్ అవుతుందా..? అయితే మీకు ఒక చక్కటి శుభవార్తను తీసుకువచ్చింది ఈపీఎఫ్ఓ. అదేమిటంటే తాజాగా ఈపీఎఫ్ ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు పీఎఫ్ ఖాతా దారులకు ఒక శుభకరమైన తీపి కబురు అందించింది.
అదేమిటంటే పీఎఫ్ అకౌంట్ లో వడ్డీ డబ్బులు కూడా జమ చేసినట్లు ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఈపీఎఫ్ 23.34 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు పిఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారికంగా ట్వీట్ చేస్తూ వెల్లడించింది. 2020 - 21 వ ఆర్థిక సంవత్సరానికిగానూ ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏకంగా 8.5 శాతం వడ్డీ రేటు తో పీఎఫ్ అకౌంట్ లో డబ్బు జమ చేశామని  వెల్లడించింది. ఇకపోతే పిఎఫ్ ఖాతాదారులకు ఇది మంచి ఊరట కలిగించే శుభవార్త అని చెప్పవచ్చు.
అయితే ముందుగా ఈపీఎఫ్ వెబ్సైట్ కి వెళ్లి మీరు మీ ఖాతా లో ఎంత వడ్డీ డబ్బులు జమ అయిందో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ ఖాతా నెంబర్ కు సంబంధించిన యు ఏ ఎన్ నెంబర్, పాస్వర్డ్ మీ దగ్గర తప్పకుండా కలిగి ఉండాలి.. అంతే కాదు మీ యు ఏ ఎన్ నెంబర్ ఆక్టివేట్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఫోన్ నెంబర్ ,ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లాంటివి లింక్ చేసి ఉండడం వల్ల త్వరగా యు ఏ ఎన్ నెంబర్ ద్వారా మీ ఖాతాలో డబ్బు ఎంత జమ అయి ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇవన్నీ కనుక మీ దగ్గర ఉంటే వెంటనే ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎంత డబ్బు జమ చేశారో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: