మనీ: గ్యాస్ సిలిండర్ కొనేవారికి సబ్సిడీ లభిస్తుందా.. లేదా..?

Divya
ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ వినియోగం ఎక్కువ అవుతోంది కాబట్టి ఎక్కడ చూసినా గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరి కాబట్టి కొత్త సిలిండర్లను కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మీరు కూడా ఒక కొత్త సిలిండర్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? ఇక ఆ సిలిండర్ ను ప్రతినెల రీఫిల్ కూడా చేస్తున్నారా..? అయితే చాలా మంది కొత్త సిలిండర్ కొనగానే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం తమ అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు.. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పై కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు చేరుకుంది. ఇకపోతే మరో కొద్ది రోజులు పోతే ఆ సిలిండర్ ధర కూడా వెయ్యి రూపాయలు దాటే అవకాశం ఉంటుంది. అయితే రెండు సిలిండర్లు తీసుకున్నప్పుడు 1000 కంటే అదనంగా చార్జీలు వేయడం ఖాయం.అందులో సబ్సిడీ  ఇచ్చే విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వం రెండు పద్ధతుల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అదేమిటంటే సబ్సిడీ లేకుండా ఎల్పిజి సిలిండర్లను అమ్మడం.. రెండవది ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఎవరైతే ఇంటి ఉపకరణాలకు సిలిండర్లను ఉపయోగిస్తున్నారో వారికి మాత్రమే సబ్సిడీ లభిస్తోంది. కానీ మరికొంతమంది స్వచ్ఛందంగా తమ సబ్సిడీని వదులుకున్నారు.. వీరు పూర్తి మొత్తం చెల్లించి గ్యాస్ సిలిండర్ను తీసుకోవడం గమనార్హం. ఇక కొత్త రూల్స్ ఏమిటంటే ఎవరికైతే పది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటుందో వారికి సబ్సిడీ తొలగించాలని ప్రాతిపదికన తీసుకొచ్చే ప్రయత్నం లో వుంది  కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: