మనీ: రూ.50 వేలతో 6 నెలల్లో రూ.3 లక్షలు..!!

Divya
అదృష్టం కలిసి వస్తే ఒక్క షేర్ చాలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఆర్జించి పెడుతుంది.. ఇక అవే షేర్లు ఆరు నెలల్లో ఒక వ్యక్తిని లక్షాధికారి కూడా చేస్తున్నాయి.. చాలామంది డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నా కేవలం స్టాక్ మార్కెట్ ని ఎంచుకోవడానికి కారణం అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందవచ్చు అని.. ఈ స్టాక్ మార్కెట్ లో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి కాబట్టి రిస్కు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి..
షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా త్వరగా డబ్బులను రెట్టింపు చేసే షేర్లను కూడా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అందులో బాగా పాపులారిటీ పొందిన షేర్ టాటా టెలి సర్వీసెస్ కూడా ఒకటి. ఈ షేరు గత ఆరు నెలల్లోనే ఇన్వెస్టర్లకు భారీగా రాబడిని అందించింది.. ఇందులో ఏకంగా 538 శాతం ర్యాలీ  పెరిగింది . ఇక ఈ షేర్లు కొన్న వారికి కాసుల వర్షం కురిసింది అని చెప్పాలి. టాటా టెలి సర్వీసెస్ షేర్ ధర ఒక్కొక్కటి 2021 మే నెలలో 12 రూపాయలు పలుకగా ఇప్పుడు 80 రూపాయలకు చేరుకుంది.
దీంతో ఇన్వెస్టర్ల సంపద కూడా బాగా పెరిగింది. మే నెలలో  మీరు గనక 20 వేల రూపాయలను పెట్టి ఉంటే ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ కూడా సుమారుగా రూ.3.18 లక్షలు పొందారు. ఒకవేళ మీరు 50,000 కాకుండా లక్ష రూపాయలు గనుక అప్పుడే పెట్టి ఉంటే దాని విలువ 6.37 లక్షలు వచ్చేవి. ఈ షేర్ మధ్యలో 34 రూపాయల వద్ద పడిపోయి మళ్ళీ పెరిగింది. కాబట్టి మీరు కూడా సరైన షేర్ ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ కాలంలోనే ఆశించని ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: