మనీ: పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు శుభవార్త తెలిపిన హెచ్ డీ ఎఫ్ సీ..!!

Divya
తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది.. ఇందులో భాగంగానే ఐపీపీబీ కస్టమర్లకు ఎటువంటి రిస్క్ లేకుండా హోమ్ లోన్ పొందే అవకాశం ఉంటుందట. ఇకపోతే తాజాగా దేశీ దిగ్గజ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.. దీంతో ఎవరైనా సరే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు కస్టమర్లు సులభంగానే హెచ్డిఎఫ్సి బ్యాంకులో హోమ్ లోన్స్ పొందవచ్చు..
దేశవ్యాప్తంగా ఆరువందలకు పైగా బ్రాంచీలు ఉండడంతోపాటు 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ లు కలిగి వుండి, IPPB కి 4.8 కోట్ల మందికి పైగా కస్టమర్లు కూడా ఉన్నారు.. వీరందరికీ హోమ్ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేటుకి అందుబాటులోకి రానున్నాయి.. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు కూడా రుణాలు పొందవచ్చు. IPPB తన బ్రాంచ్ లు మాత్రమే కాకుండా పోస్టాఫీసు ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురానుంది.. కేవలం లోన్ ప్రాసెస్ మాత్రమే కాదు రుణాలు మంజూరు చేయడం వంటి తదితర అంశాలను కూడా హెచ్డీఎఫ్సి చూసుకోవడం గమనార్హం.
సాధారణంగా పోస్ట్ ఆఫీసు ద్వారా కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకులో  హోమ్ లోన్ లేదా దేనికైనా రుణాలు తీసుకున్నట్లయితే అధిక వడ్డీ రేటు కూడా ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోస్టల్ శాఖ వస్తుంది కాబట్టి ప్రజలకు రుణాలు కూడా అతి తక్కువ వడ్డీకి లభిస్తాయి. ఇప్పటికీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల సరికొత్త పథకాలను పోస్టల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హెచ్డిఎఫ్సి తో మమేకం అయి ఎంతోమంది ప్రజలకు సులభంగా హోమ్ లోన్స్ మంజూరు చేయడానికి పోస్టల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయం తెలియగానే అటు పోస్ట్ ఆఫీస్ కస్టమర్ ల తో పాటు ఇటు కొత్తగా పోస్టాఫీసులో పాలసీలు తీసుకోవాలనుకునే వారు కూడా హోమ్ లోన్ ప్రయోజనాలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: