మనీ: బ్యాంకులో ఖాతా ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున శుభవార్త..!

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే అతిపెద్ద నేషనల్ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా తమ కస్టమర్ల కోసం సరికొత్త వినూత్నమైన శుభవార్త తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు తీపి వార్తను తీసుకొచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఎవరైతే ఖాతా కలిగి ఉంటారో అలాంటి వారికి ఉచితంగా రెండు లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా కల్పిస్తామని ప్రకటించడం గమనార్హం.

ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జన్ ధన్ ఖాతా కలిగినవారు.. ఈ బెనిఫిట్ పొందడానికి అర్హులు.ఎవరైతే పంజాబ్ నేషనల్ బ్యాంకు లో  ఈ ఖాతా ను కలిగి ఉంటారో.. అలాంటి వాళ్లకు పీఎన్‌బీ రూపే జన్ ధన్ కార్డు కూడా లభిస్తుంది. ఈ కార్డ్ పొందినవారికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా  లభిస్తుంది. ఈ కార్డును కలిగిన వాళ్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం  2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాను అందిస్తుంది. అయితే రూపే కార్డు మాత్రమే ఉంటే కార్డు సరిపోదు..ఈ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు తరచూ జన్ ధన్ ఖాతా ద్వారా లావాదేవీలు జరిపితే మాత్రమే.. జీవిత బీమా వర్తిస్తుంది. అందుకే మీకు సమయం ఉండి డబ్బు ఉన్నప్పుడల్లా ఖాతాలో  డబ్బులు వేస్తూ ఏటీఎం నుంచి అప్పుడప్పుడూ డబ్బులను తీసుకుంటూ ఉంటే మంచిది.

అయితే ప్రమాదవశాత్తు ఖాతా కలిగినవాళ్ళు మరణిస్తే కచ్చితంగా ఈ జన్ ధన్ ఖాతా ద్వారా ఉచిత బీమా రెండు లక్షల రూపాయలు అందుతాయి. ఇకపోతే ఇతర బ్యాంకులలో జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నట్లయితే అలాంటి వారికి ఉచిత బీమా వర్తించదు. ఎవరైతే పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జనరల్ ఖాతా కలిగి ఉంటారో అలాంటి ఖాతాదారులకు మాత్రమే ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఉచితంగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: